
SRH : ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న ఎస్ఆర్‌హెచ్.. కానీ కేకేఆర్, ఆర్‌సీబీ, లక్నో జట్లకు కీలక పరీక్ష!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ ప్రయాణం ముగిసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు, ఈసారి గ్రూప్ దశకే పరిమితమైంది.
సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సిన కీలక మ్యాచ్ వర్షార్పణం కావడంతో SRH ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ పూర్తియైనా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాకముందే వర్షం కారణంగా ఆట రద్దయ్యింది. ఫలితంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించారు.
ఇప్పటికీ SRH కు లీగ్ దశలో మూడు మ్యాచ్‌లున్నాయి. మే 10న కోల్‌కతా నైట్‌రైడర్స్, మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 18న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులు జరగనున్నాయి.
Details
ఇతర జట్లపై ప్రభావం చూపనున్న సన్ రైజర్స్
అభిమానులకు కొంతమేర ఊరటనివ్వాలనే ఆశతో SRH ఈ మ్యాచ్‌లను గెలవాలని కోరుకుంటోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న ఈ జట్టు, మిగతా మ్యాచ్‌లు గెలిచి స్థానం మెరుగుపరచాలనే లక్ష్యంతో ఉంది.
ఇదే సమయంలో, SRH మిగిలిన మ్యాచ్‌లు ఇతర జట్ల ప్లేఆఫ్స్ ఆశలపై ప్రభావం చూపే అవకాశముంది.
Details
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)
కేకేఆర్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి, 5 విజయాలు, 5 పరాజయాలు నమోదు చేసుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ప్రస్తుతం 11 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేట్ +0.249గా ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది.
అయితే ఎస్ఆర్‌హెచ్ వచ్చే మ్యాచ్‌లో ఓటమి పొందితే, ప్లేఆఫ్స్ రేసు నుంచి తృటిలో నిష్క్రమించే ప్రమాదం కేకేఆర్‌ను వెంటాడుతోంది.
Details
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
ఆర్సీబీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి, 8 గెలిచింది. 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
నెట్‌రన్‌రేట్ +0.482. మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్‌కు ప్రవేశిస్తుంది.
అయితే టాప్-2 స్థానాల్లో నిలిచి అడ్వాంటేజ్ పొందాలంటే మిగతా మ్యాచ్‌లు, ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్‌పై మ్యాచ్ గెలవాల్సిందే.
ఎందుకంటే టాప్-2 జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలుండగా, 3వ, 4వ స్థానాల్లో ఉన్న జట్లకు ఒక్క తప్పు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది.
Details
లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
ఎల్ఎస్‌జీ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 5 విజయాలు, 6 ఓటములు పొందింది. 10 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
నెట్‌రన్‌రేట్ -0.469. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
అయితే ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ఓటమి పాలైతే లక్నో ప్లేఆఫ్స్ ఆశలు పెద్ద దెబ్బ తినే అవకాశం ఉంది.
మొత్తానికి, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా, మిగతా జట్ల ఆశలపై ప్రభావం చూపే స్థితిలో ఉంది. KKR, RCB, LSG వంటి జట్లకు ఇప్పుడు SRH ఓ అనిశ్చిత భయంగా మారింది.
ఈ నేపథ్యంలో SRH ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోయినా.. ఇంకెంతో గేమ్ మార్చే జట్టుగా నిలవబోతోంది.