SRH vs KKR: ఓడితే ఫ్లే ఆఫ్‌కు కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 47వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ లో స్టేడియంలో జరగనుంది. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకూ 24 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో కోల్ కతా 15 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. సన్ రైజర్స్ కేవలం 9 మ్యాచ్ ల్లో మాత్రమే గెలుపొందింది. 2020లో ఇరు జట్ల మధ్య ఓ సూపర్ ఓవర్ మ్యాచ్ జరగ్గా.. అందులో కేకేఆర్ విజయం సాధించింది. ఈసీజన్లో ఎస్ఆర్‌హెచ్ 9 మ్యాచ్ ల్లో మూడింట్లో నెగ్గింది. మరోపక్క కేకేఆర్ 8 మ్యాచ్లో మూడు విజయాలను నమోదు చేసింది.
ఇరు జట్లలోని సభ్యులు
ఇరు జట్లకు ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సి ఉంటుంది. గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించిన సన్ రైజర్స్.. కేకేఆర్ పై గెలిచి విజయాల బాట పట్టాలని భావిస్తోంది. మరోపక్క గుజరాత్ చేతిలో ఓడిన కేకేఆర్.. ఎస్ఆర్ హెచ్ పై గెలిచి ఫ్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. హైదరాబాద్:అభిషేక్ శర్మ, మయాంక్అగర్వాల్, త్రిపాఠి, మార్క్రామ్, హ్యారీబ్రూక్, క్లాసెన్, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మార్కండే, ఉమ్రాన్ మాలిక్ కోల్‌కతా : జగదీసన్, గుర్బాజ్(WK), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), రింకుసింగ్, రస్సెల్, నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి