DC vs SRH : ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం సాధించింది.
వరుసగా మూడు పరాజయాల తర్వాత హైదరాబాద్ గెలుపొందింది. గత మ్యాచ్లో సొంతగడ్డపై ఓడిపోయిన హైదరాబాద్.. ఈసారి ఢిల్లీని సొంతమైదానంలో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరును చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులు, హెన్రిచ్ క్లాసిన్ 26 బంతుల్లో 51 పరుగులతో విజృంభించారు.
ఢిల్లీ బౌలర్లలో మార్ష్ నాలుగు వికెట్లు చెలరేగాడు. ఇక అక్షర్ పటేల్, ఇషాంత్ తలా ఓ వికెట్ తీశారు
Details
రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు
లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీకి తొలి ఓవర్లలో ఊహించని షాక్ తగిలింది. వార్నర్ ను(0) భువనేశ్వర్ ఔట్ చేశాడు.
అనంతరం ఫిలిప్ షాల్ట్, మిచిల్ మార్స్ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. పిలిప్ షాల్ట్(59), మిచెల్ మార్స్ 63 పరుగులతో సన్ రైజర్స్ కు చెమటలు పట్టించారు.
మార్కెండే ఫిలిప్ షాల్ట్ ను ఔట్ చేసి ఢిల్లీ గెలుపు ఆశలకు బ్రేక్ వేశాడు. మనిష్ పాండే(1), గార్గ్(12), సర్ఫరాజ్(9) విఫలం కావడంతో ఢిల్లీ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులే చేయగలిగింది.
హైదరాబాద్ బౌలర్లలో మార్కెండ్ రెండు, అభిషేక్ శర్మ, భువనేశ్వర్, నటరాజన్, హాసిన్ తలా ఓ వికెట్ తీశారు.