DC vs SRH : అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. సన్ రైజర్స్ స్కోరు ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 40 మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కు అదిలోనే ఎదురెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5), రాహుల్ త్రిపాఠి (10) వెంట వెంటనే ఔట్ కావడంతో సన్ రైజర్స్ కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 36 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన హ్యారీబ్రూక్(0), మిచెల్ మార్ష్ బౌలింగ్ లో అక్షర పటేల్ కు క్యాచ్ ఇచ్చి పూర్తిగా నిరాశపరిచాడు.
బౌండరీల వర్షం కురిపించిన హెన్రిచ్ క్లాసిన్
చివర్లో హెన్రిచ్ క్లాసిస్ ఢిల్లీ బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 26 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అదే విధంగా అబ్దుల్ సమద్(28), హిసిన్(16) పరుగులతో ఫర్వాలేదనిపించారు. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఇక అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ తలా ఓ వికెట్ తీశారు.