T20 World Cup 2026: భారత్‌తో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్‌కు శ్రీలంక విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ సమయం దగ్గరపడుతున్నా పాకిస్థాన్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ఇప్పటికే తేల్చి చెప్పడంతో టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, భారీ ప్రేక్షకాదరణ. అదే ఉత్కంఠ కోట్ల రూపాయల ఆదాయంగా మారుతుంది. కానీ పాకిస్థాన్ మ్యాచ్ బాయ్‌కాట్ నిర్ణయం తీసుకోవడంతో ఐసీసీతో పాటు ఆతిథ్య దేశం శ్రీలంక కూడా ఇబ్బందుల్లో పడింది.ఈ నిర్ణయానికి మూల కారణంగా బంగ్లాదేశ్ అంశం తెరపైకి వచ్చింది.
Details
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్
భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడంతో ఐసీసీ వారి స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. దీనికి నిరసనగా పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడవద్దని తమ జట్టుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌పై ప్రభావం చూపిస్తోంది. పాకిస్థాన్ నిర్ణయంతో ఎక్కువగా నష్టపోయేది శ్రీలంక క్రికెట్ బోర్డే (ఎస్‌ఎల్‌సీ). భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వల్ల టికెట్లు, టీవీ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో భారీ ఆదాయం వస్తుందని శ్రీలంక ఆశించింది. ఇప్పటికే కొలంబోలో హోటళ్లు, విమానాలు ఫుల్‌గా బుక్ అయ్యాయి. మ్యాచ్ రద్దైతే ఈ ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. టూరిజం రంగానికి కూడా తీవ్ర దెబ్బ పడే అవకాశం ఉంది.
Details
మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధం
ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) లేఖ రాసింది. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రపంచ జట్లు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు నిరాకరించినప్పటికీ, శ్రీలంక మాత్రం అక్కడికి వెళ్లి మ్యాచ్‌లు ఆడిందని లేఖలో గుర్తుచేసింది. అప్పుడు చూపిన మద్దతుకు ప్రతిగా ఇప్పుడు కూడా పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడాలని శ్రీలంక విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ అందరి ప్రయోజనాలకు అనుకూలమని పేర్కొంటూ గురువారం ఆ లేఖను పంపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, భారత జట్టు తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భారత్ మ్యాచ్ ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు.
Details
కొలంబోకు వెళ్లేందుకు ఫ్లైట్ కూడా బుక్ అయింది
కొలంబోకు వెళ్లేందుకు ఫ్లైట్ కూడా బుక్ అయిందని, ప్రత్యర్థి జట్టు నిర్ణయం మాత్రం తమ చేతుల్లో లేదన్నారు. గతంలో ఆసియా కప్‌ను న్యూట్రల్ వేదికల్లో ఆడినప్పటికీ, ఈసారి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని టీమిండియా స్పష్టం చేసింది. ఇప్పుడు బంతి పూర్తిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోర్టులోనే ఉంది. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే, దాని వల్ల వచ్చే పరిణామాలకు పీసీబీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది క్రికెట్‌కు మాత్రమే కాదు, శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు, అభిమానులకు కూడా పెద్ద దెబ్బగా మారనుంది. పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక వరల్డ్ కప్‌లో ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను రద్దు చేసే పరిస్థితి వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.