వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకున్న శ్రీలంక..!
న్యూజిలాండ్ గడ్డపై వన్డేలు, టీ20 సిరీస్ లు ఆడేందుకు అడుగుపెట్టిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్ పై టెస్టు సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలని భావించిన శ్రీలంకకు న్యూజిలాండ్ చావు దెబ్బ కొట్టింది. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించినా ఫలితం లేకుండా పోయింది. తొలి వన్డేలో ఓటమిపాలై వరల్డకప్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను చేజార్చుకున్న శ్రీలంక.. కివీస్ తో నేడు జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో శ్రీలంక వరల్డ్ కప్‌కు అర్హత ఆశలను పూర్తిగా వదిలేసుకుంది.
ఎనిమిదో స్థానం కోసం సౌతాఫ్రికా, ఐర్లాండ్ పోటీ
ఒకవేళ శ్రీలంక మూడో వన్డే గెలిచినా సిరీస్ డ్రా అవుతుందే తప్ప.. ఒరిగేదేమీ ఉండదు.కివీస్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఐసీసీ శ్రీలంక జట్టుకు ఓ పాయింట్ కోత విధించింది. న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లండ్ (155), భారత్ (139), బంగ్లాదేశ్ (130), పాకిస్థాన్ (130), ఆస్ట్రేలియా (120), ఆఫ్ఘనిస్తాన్ (115) వరుసగా 2 నుంచి 7 స్థానాల్లో నిలిచాయి. శ్రీలంక 82 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలించింది. జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ ఇప్పటికే టోర్ని నుంచి దాదాపు తప్పుకున్నట్లుగా చెప్పొచ్చు. మిగిలిన మరో స్థానం కోసం సౌతాఫ్రికా, ఐర్లాండ్‌లు పోటీపడుతున్నాయి.