Page Loader
టీ20 సిరీస్‌‌లకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా టామ్ లాథమ్
న్యూజిలాండ్ టీ20 కెప్టెన్‌గా ఎంపికైన టామ్ లాథమ్

టీ20 సిరీస్‌‌లకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా టామ్ లాథమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2023
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక, పాకిస్థాన్‌తో త్వరలో న్యూజిలాండ్ జట్టు టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ రెండు సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయడం గమనార్హం. ఐపీఎల్ లో పాల్గొనేందుకు కొందరు ప్లేయర్లను న్యూజిలాండ్ యాజమాన్యం ఎంపిక చేయలేదు. ఈ రెండు సిరీస్‌లకు కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ టీమ్ సౌథీ దూరమయ్యారు. వీరిద్దరూ ఐపీఎల్ ఆడటానికి భారత్ రానుండడంతో సెలెక్టర్లు వీరిని పక్కనపెట్టారు ఇక ఈ రెండు సిరీస్‌లకు వికెట్ కీపర్ టామ్ లాథమ్ నాయకత్వం వహించనుండగా.. చాడ్ బోవ్స్, షిప్లీ తొలిసారి న్యూజిలాండ్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు.

న్యూజిలాండ్

శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత పాక్ పర్యటనలో న్యూజిలాండ్

శ్రీలంక టీ20 సిరీస్ ముగిసిన తర్వాత కివీస్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా అతిథ్య జట్టుతో కివీస్ ఐదు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. శ్రీలంక సిరీస్‌కు కివీస్‌ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ హెన్రీషిప్లీ, ఇష్‌సోధి, విల్ యంగ్. పాకిస్తాన్‌ సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), చాడ్ బోవ్స్, మార్క్ చాప్మన్, మాట్ హెన్రీ, బెన్ లిస్టర్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, నీషమ్, రచిన్ రవీంద్ర, హెన్రీ‌షిప్లీ, ఇష్ సోధి, విల్ యంగ్. డేన్ క్లీవర్, కోల్ మెక్‌కాన్చీ, టిక్నర్.