Page Loader
IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక .. ఎటువంటి మార్పులోకి బరిలోకి టీమిండియా  

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక .. ఎటువంటి మార్పులోకి బరిలోకి టీమిండియా  

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2023
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్‌ 2023 లో భాగంగా ఇవాళ శ్రీలంక, టీమిండియా మధ్య కీలక పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో విజయం సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు స్వదేశంలో భారీ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక చూస్తోంది. ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో ఇరుజట్లు 9సార్లు తలపడ్డాయి. ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచుల్లో గెలుపొందగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఇక శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఎటువంటి మార్పుల్లేకుండా ఈ మ్యాచ్ ఆడనుంది.

Details

ఇరు జట్లలోని సభ్యులు 

టీమిండియా జట్టు రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ శ్రీలంక జట్టు పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక .