Loading...
IND vs SL: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. 503/9 వద్ద భారత్‌ డిక్లేర్‌!
శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. 503/9 వద్ద భారత్‌ డిక్లేర్‌!

IND vs SL: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. 503/9 వద్ద భారత్‌ డిక్లేర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. 503/9 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డిక్లేర్‌ చేసే సమయానికి ధ్రువ్‌ జురెల్‌ 115 పరుగులతో నాటౌట్‌గా, ప్రసిద్ధ్‌ కృష్ణ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు లంక బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఏకంగా రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. తొలి టెస్టులో సెంచరీ చేసిన దేవదత్‌ పడిక్కల్‌.. రెండో టెస్టులోనూ శతకంతో మెరిశాడు. అతడు 117 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోవైపు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు.

వివరాలు

ధ్రువ్‌ జురెల్‌ సూపర్ సెంచరీ

115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు.

ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి టెస్టుల్లో సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా జురెల్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 50 పరుగులతో అర్ధ సెంచరీ నమోదు చేయగా.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ 63 పరుగులతో రాణించాడు.

గాయం కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడిన పంత్‌.. కోలుకుని తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీ చేయడం విశేషం.

వివరాలు

రాణించిన జడేజా, జైస్వాల్

యశస్వి జైస్వాల్‌ 45, రవీంద్ర జడేజా 43 పరుగులతో పర్వాలేదనిపించారు.

కేఎల్‌ రాహుల్‌ 18, సారాంశ్‌ జైన్‌ 6, మానవ్‌ సుతార్‌ 18, మహ్మద్‌ సిరాజ్‌ 3 పరుగులు చేశారు.

శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రభాత్‌ జయసూర్య, కేషార నువాంత చెరో రెండు వికెట్లు తీశారు. లాహిరు కుమారకు ఒక వికెట్‌ దక్కింది.

ADVERTISEMENT