ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన శ్రీలంక స్పిన్నర్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్టు క్రికెట్ లో 71 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును శ్రీలంక స్పిన్నర్ బద్దలు కొట్టాడు. గాలే వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న రెండు టెస్టులో ప్రభాత్ జయసూర్య ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, కొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
రెండు టెస్టు ఐదో రోజు ఆటలో ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టెరింగ్ ను ఔట్ చేసి జయసూర్య టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన స్పిన్నర్ గా చరిత్రకెక్కాడు.
1951లో వెస్టిండీస్ స్పిన్నర్ వాలెంటైన్ 8 టెస్టుల్లో 50 వికెట్లు తీయగా.. జయసూర్య కేవలం ఏడు మ్యాచ్ ల్లోనూ ఆ ఘనతను సాధించాడు.
Details
సంచలన రికార్డును సాధించిన జయసూర్య
టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న రికార్డు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ చార్లీ టర్నర్ పేరిట ఉంది. అతడు 1988 లో ఇంగ్లండ్ తో తన ఆరో టెస్టులోనే 50 వికెట్లు తీశాడు.
గతేడాది ఆస్ట్రేలియాతో తన కెరీర్ ప్రారంభించిన జయసూర్య.. తొలి టెస్టులోనే 12 వికెట్లు తీసుకొని విజృంభించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ తో జరిగిన రెండు టెస్టులో మరో 17 వికెట్లు తీయడం విశేషం.
ఐర్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు సాధించాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరోసారి 5 వికెట్లు తీయడం ద్వారా ఆ రికార్డు ను సాధించాడు.