Loading...
Chris Lynn: కొకైన్ వివాదం నుంచి బయటపడ్డ స్టార్ బ్యాటర్.. బిగ్‌బాష్‌లోకి రీఎంట్రీ!
కొకైన్ వివాదం నుంచి బయటపడ్డ స్టార్ బ్యాటర్.. బిగ్‌బాష్‌లోకి రీఎంట్రీ!

Chris Lynn: కొకైన్ వివాదం నుంచి బయటపడ్డ స్టార్ బ్యాటర్.. బిగ్‌బాష్‌లోకి రీఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ క్రిస్ లిన్‌కు భారీ ఊరట లభించింది. నిషేధిత కొకైన్ తీసుకున్నందుకు అతడిపై విధించిన నెల రోజుల నిషేధం పూర్తయింది. దీంతో త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాష్ లీగ్‌ (BBL 2026-27)లో ఆడేందుకు క్రిస్ లిన్‌కు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ రెగ్యులేటరీ వెల్లడించింది. కాగా, బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ లిన్ కొనసాగుతున్నాడు.

వివరాలు

అసలేం జరిగింది?

2026 జూలై 18న ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ డే (T20 Blast Finals Day) మ్యాచ్‌ల సందర్భంగా క్రిస్ లిన్‌కు సాధారణ యాంటీ డోపింగ్ పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్షలో అతడి మూత్ర నమూనాలో కొకైన్‌కు సంబంధించిన 'బెంజోయిల్‌ఎక్గోనైన్' (Benzoylecgonine) అనే పదార్థం ఉన్నట్లు నిర్ధారణైంది.

ఆ సమయంలో క్రిస్ లిన్ నార్తాంప్టన్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడిన అనంతరం తాను కొకైన్ తీసుకున్నట్లు అంగీకరించాడు.

జూలై 15 రాత్రి, 16వ తేదీ తెల్లవారుజామున కొకైన్ వినియోగించినట్లు వెల్లడించాడు.

అయితే క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో కాకుండా, వ్యక్తిగత కారణాలతోనే దానిని తీసుకోవాల్సి వచ్చిందని ఇంగ్లండ్ రెగ్యులేటరీ బోర్డుకు వివరించాడు.

వివరాలు

క్రిస్ లిన్‌పై మూడు నెలల సస్పెన్షన్

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన క్రికెట్ రెగ్యులేటర్ తొలుత క్రిస్ లిన్‌పై మూడు నెలల సస్పెన్షన్ విధించాలని భావించింది.

అయితే అతడు పునరావాస కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో నిషేధ కాలాన్ని ఒక నెలకు తగ్గించింది.

ఈ క్రమంలో జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య తనపై విధించిన నిషేధాన్ని క్రిస్ లిన్ పూర్తి చేసుకున్నాడు.

మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో కాకుండా సాధారణ సమయంలోనే క్రిస్ లిన్ కొకైన్ తీసుకున్నట్లు నిపుణులు నిర్ధారించడంతో అతడికి కఠిన చర్యల నుంచి కొంత ఉపశమనం లభించింది.

తాజాగా నెల రోజుల నిషేధం పూర్తికావడంతో తిరిగి క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్ 2026-27 టోర్నీలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

క్రిస్ లిన్ కెరీర్ గణాంకాలు ఇవే!

క్రిస్ లిన్ ఆస్ట్రేలియా తరఫున నాలుగు వన్డేలు, 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్‌లో మొత్తం 42 మ్యాచ్‌లు ఆడి 1,329 పరుగులు సాధించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్ లిన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.

ఇప్పటివరకు 137 మ్యాచ్‌లు ఆడి 4,133 పరుగులు చేశాడు. బీబీఎల్ చరిత్రలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

ఇప్పుడు నిషేధం ముగియడంతో మరోసారి బిగ్‌బాష్‌లో తన బ్యాట్‌తో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

ADVERTISEMENT