LOADING...
IPL 2026 Auction: ఐపీఎల్ 2026కు స్టార్ క్రికెటర్ల దూరం.. షాక్ ఇచ్చిన పెద్ద లిస్ట్!
ఐపీఎల్ 2026కు స్టార్ క్రికెటర్ల దూరం.. షాక్ ఇచ్చిన పెద్ద లిస్ట్!

IPL 2026 Auction: ఐపీఎల్ 2026కు స్టార్ క్రికెటర్ల దూరం.. షాక్ ఇచ్చిన పెద్ద లిస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి సంబంధించిన కౌంట్‌డౌన్ వేగంగా సాగుతోంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఈ మినీ ఆక్షన్ కోసం మొత్తం 1,355 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. మొత్తం 10 జట్లలో 77 స్లాట్‌లు ఖాళీగా ఉండగా, అందులో 31 విదేశీ స్లాట్‌లు ఉండటం ప్రత్యేకత. ఈసారి 14 దేశాల నుంచి ఆటగాళ్లు రిజిస్టర్ అవ్వడం వల్ల మినీ వేలానికి రికార్డ్ స్థాయి స్పందన లభించింది. అయితే ఈ భారీ రిజిస్ట్రేషన్ మధ్యలో, ఐపీఎల్ 2026కి దూరమవుతున్న స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు.

Details

ఐపీఎల్ 2026 నుండి దూరంగా ఉండే స్టార్ క్రికెటర్లు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన పేరు రిజిస్ట్రేషన్ చేయకపోవడం పెద్ద షాక్‌గా మారింది. గతేడాది పంజాబ్ కింగ్స్ తరఫున మ్యాక్సీ కేవలం 48 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసి తీవ్ర నిరాశ పరచాడు. గాయం కారణంగా టోర్నీని వదిలేయాల్సి రావడంతో, ఈసారి వేలంలో ఉన్నా కూడా అతడిని కొనుగోలు చేయాలనే ఆలోచన ప్రాంచైజీలు పెద్దగా చూపకపోవచ్చని భావిస్తున్నారు. వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ తాజాగా ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Details

వేలంలో ఫాఫ్ డుప్లెసిస్

దీంతో అతను ఐపీఎల్ 2026లో కనిపించడు. కేకేఆర్ ఇప్పటికే అతడిని 'పవర్ కోచ్'గా నియమించింది. దక్షిణాఫ్రికా సూపర్‌స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కూడా ఈసారి ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. వీరిద్దరూ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. వివాహం నేపథ్యంలో జోష్ ఇంగ్లిస్ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే నలుగురు కీలక ఆటగాళ్లు దూరమవుతున్న నేపథ్యంలో, వేలంలో మరికొందరు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరడం తథ్యమే.

Advertisement

Details

స్టార్ క్రికెటర్లతో నిండిన 2026 మినీ వేలం

ఈసారి వేలంలో స్టార్ క్రికెటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ లియామ్ లివింగ్‌స్టోన్ ముజీబుర్ రెహ్మన్ జోష్ ఇంగ్లిస్ స్టీవ్ స్మిత్ ముస్తాఫిజుర్ రెహ్మన్ బెన్ డకెట్ మైకేల్ బ్రాస్‌వెల్ డేవాన్ కాన్వే మ్యాట్ హెన్రీ కైల్ జేమీసన్ డారిల్ మిచెల్ రచిన్ రవీంద్ర గెరాల్డ్ కొయెట్జీ డేవిడ్ మిల్లర్ లుంగి ఎంగిడి అన్రిచ్ నోకియా వానిందు హసరంగ మతీశా పతిరనా మహీశ్ తీక్షణ జేసన్ హోల్డర్ షై హోప్ అల్జారీ జోసెఫ్ ఈ స్టార్ పవర్ వల్ల వేలంలో పోటీ ఉత్కంఠభరితంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement