LOADING...
Most Expensive Players: నిరాశపరుస్తున్న కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయర్స్.. అభిమానుల్లో అసంతృప్తి
నిరాశపరుస్తున్న కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయర్స్.. అభిమానుల్లో అసంతృప్తి

Most Expensive Players: నిరాశపరుస్తున్న కోట్లు పెట్టి కొన్న స్టార్ ప్లేయర్స్.. అభిమానుల్లో అసంతృప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భారీ ధరలకు కొనుగోలు అయిన ఆటగాళ్లు రాణించకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలంలో కోట్ల రూపాయలతో కొన్న ప్లేయర్స్‌పై ఫ్రాంచైజీల ఆశలు ఎక్కువగా ఉండటం సహజం. అయితే కొన్ని ఫ్రాంచైజీలు పెట్టిన భారీ పెట్టుబడికి తగిన ఫలితాలు ఇంకా రాలేదు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ.25.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొన్నప్పటికీ, అతడి ప్రదర్శన అసంతృప్తికరంగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లో కేవలం 18, 2, 4 రన్స్ మాత్రమే చేసి విమర్శల కర్రెత్త ఎదుర్కొంటున్నాడు. అలాగే రూ.7 కోట్లకు కొన్న వెంకటేష్ అయ్యర్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రూ.8.40 కోట్లకు తీసుకున్న ఆఖిబ్ నబీ కూడా ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేదు.

వివరాలు

లివింగ్‌స్టోన్, కార్తీక్ శర్మ విఫలం

లియామ్ లివింగ్‌స్టోన్ రూ.13 కోట్ల ధరకు కొనుగోలు చేయబడినా, ఒక్క మ్యాచ్‌లో 14 పరుగులు చేసి అభిమానులను నిరాశపరిచాడు. రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసిన కార్తీక్ శర్మ మూడు మ్యాచ్‌ల్లో 18, 1, 6 పరుగులు మాత్రమే చేయగా, ప్రశాంత్ వీర్ రెండు మ్యాచ్‌ల్లో 6*, 43 పరుగులతో కొంత మెరుగైన ప్రదర్శన కనబరచాడు. మొత్తానికి ఐపీఎల్ 2026లో భారీ ధరల ప్లేయర్స్‌లో చాలా మంది ఇప్పటివరకు ఫ్రాంచైజీలకు ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement