ODI cricket: 2025 వన్డే క్రికెట్‌లో మెరిసిన స్టార్ ప్లేయర్లు.. బెస్ట్ పెర్ఫార్మర్స్ ఆటగాళ్లగా గుర్తింపు!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20లకు పెరుగుతున్న ఆదరణ, టెస్టు క్రికెట్ మళ్లీ ఊపందుకున్నప్పటికీ వన్డే క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకత మాత్రం తగ్గలేదు. 2025లో కూడా వన్డే ఫార్మాట్‌లో పలువురు క్రికెటర్లు అసాధారణ ప్రదర్శనలతో అభిమానులను అలరించారు. ఈ ఏడాది భారత్ విజేతగా నిలిచిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్‌కు హైలైట్‌గా నిలిచింది. 2025 ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించిన ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
Details
1 జో రూట్ - 2025లో అత్యధిక వన్డే పరుగులు
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ 2025లో టెస్టుల్లో చరిత్ర సృష్టించడమే కాదు, వన్డేల్లోనూ అదరగొట్టాడు 15 ఇన్నింగ్స్‌ల్లో 808 పరుగులు చేసి, ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. సగటు 65.77, స్ట్రైక్‌రేట్ 95.50గా నమోదయ్యాయి. ఈ ఏడాది అతని ఖాతాలో 3 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్‌తో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో 139 బంతుల్లో అజేయంగా 166 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
Details
మాథ్యూ బ్రిట్జ్కే
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రిట్జ్కే 2025లో వన్డే క్రికెట్‌లో తన సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 150 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. తొలి ఐదు వన్డేల్లోనూ 50+ స్కోర్లు సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు. 12 వన్డేల్లో 706 పరుగులు, సగటు 64.18, స్ట్రైక్‌రేట్ 96.71. ఈ ఏడాది అతని ఖాతాలో ఒక సెంచరీ, ఆరు అర్ధసెంచరీలున్నాయి.
Details
విరాట్ కోహ్లీ
భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 2025లోనూ వన్డేల్లో తన క్లాస్ చూపించాడు. 13 మ్యాచ్‌ల్లో 651 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. సగటు 65.10, స్ట్రైక్‌రేట్ 96.15గా కొనసాగింది. మొత్తం 7 సార్లు 50+ స్కోర్లు, అందులో 3 సెంచరీలున్నాయి. పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో తొలి సెంచరీ చేయగా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు.
Details
మ్యాట్ హెన్రీ - 2025లో టాప్ వికెట్ టేకర్
న్యూజిలాండ్ సీనియర్ పేసర్ మ్యాట్ హెన్రీ 2025లో వన్డేల్లో బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. 13 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు, సగటు 18.58, ఎకానమీ 5.16. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది మూడు సార్లు నాలుగు వికెట్లు, ఒక ఫైవ్‌ఫర్ సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై 5/42తో మెరిశాడు.
Details
జేడెన్ సీల్స్
వెస్టిండీస్ యువ పేసర్ జేడెన్ సీల్స్‌కు 2025 బ్రేక్‌థ్రూ ఇయర్‌గా మారింది. 12 వన్డేల్లో 27 వికెట్లు, సగటు 18.14, ఎకానమీ 5.75. కొత్త బంతితో స్వింగ్ సాధిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద ముప్పుగా మారాడు. ఒక నాలుగు వికెట్ల హాల్, ఒక ఫైవ్‌ఫర్ సాధించాడు. ట్రినిడాడ్‌లో పాకిస్థాన్‌పై 6/18తో బ్యాటింగ్ లైనప్‌ను కూల్చేశాడు. మొత్తానికి 2025 వన్డే క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఈ ఐదుగురు ఆటగాళ్లు తమ అసాధారణ ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్నారు.