LOADING...
Cameron Green: స్టార్క్ రికార్డు బ్రేక్.. రూ.25.20 కోట్లకు కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసిన జట్టు ఇదే!
స్టార్క్ రికార్డు బ్రేక్.. రూ.25.20 కోట్లకు కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసిన జట్టు ఇదే!

Cameron Green: స్టార్క్ రికార్డు బ్రేక్.. రూ.25.20 కోట్లకు కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసిన జట్టు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL Auction 2026) అధికారికంగా ప్రారంభమైంది. ముందే అంచనా వేసినట్టుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green)పై ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన గ్రీన్‌ను దక్కించుకునేందుకు మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ మొదలుపెట్టగా, ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీలోకి దిగింది. చివరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్ల భారీ మొత్తానికి గ్రీన్‌ను తమ జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా కామెరూన్ గ్రీన్ రికార్డు నెలకొల్పాడు.

Details

దిల్లీ క్యాపిటల్స్ కు డేవిడ్ మిల్లర్

గతంలో 2024లో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేయగా, ఆ రికార్డును ఇప్పుడు గ్రీన్ అధిగమించాడు. మొత్తం ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే గ్రీన్‌కు ఇది మూడో అత్యధిక ధర. తొలి రెండు స్థానాల్లో రిషభ్ పంత్ (రూ.27 కోట్లు - లక్నవూ సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్(రూ.26.75 కోట్లు - పంజాబ్ కింగ్స్) కొనసాగుతున్నారు. ఈ వేలంలో మరో కీలక ఒప్పందంగా దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను దిల్లీ క్యాపిటల్స్ అతడి కనీస ధర రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. భారత ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా కనీస ధర రూ.2 కోట్లతో బరిలో నిలవగా, అతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ జరిగింది.

Details

రూ.7 కోట్లకు వెంకటేష్ అయ్యర్ ను దక్కించుకునన ఆర్సీబీ

చివరికి ఆర్సీబీ రూ.7 కోట్లకు వెంకటేశ్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌ను ముంబయి ఇండియన్స్ కనీస ధర రూ.1 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను దిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు తీసుకోగా, న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ అదే ధరకు కొనుగోలు చేసింది. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగను లక్నవూ సూపర్ జెయింట్స్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది.

Advertisement

Details

అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో

అయితే బేస్ ప్రైస్ రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన న్యూజిలాండ్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రతో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, గస్ అట్కిన్సన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు జేమీ స్మిత్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. భారత బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ (కనీస ధర రూ.75 లక్షలు)పై కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అలాగే వియాన్ ముల్డర్ (కనీస ధర రూ.1 కోటి), కేఎస్ భరత్, దీపక్ హుడా (కనీస ధర రూ.75 లక్షలు) కూడా ఈ వేలంలో అమ్ముడుపోకుండా అన్‌సోల్డ్‌గా నిలిచారు.

Advertisement