
Starc vs Pooran: స్టార్క్ vs పూరన్.. వీరద్దరిలో విజేత ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో నికోలస్ పూరన్ తన బ్రాండ్‌ను క్రియేట్ చేస్తున్నాడు. కానీ అతడికి ఒకే ఒక బౌలర్ మాత్రం పెద్ద తలనొప్పిగా మారాడు.
మిచెల్ స్టార్క్. పూరన్ ఆత్మవిశ్వాసాన్ని కూల్చేయగల బౌలర్‌గా స్టార్క్ తన సామర్థ్యాన్ని నిరూపించాడు.
ఓవైపు పూరన్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే, స్టార్క్ ముందు మాత్రం పూర్తిగా వణికిపోతున్నాడు.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ ఏడు ఇన్నింగ్స్‌లలో ఎదురెదురుగా తలపడ్డారు. కానీ అందులో ఐదుసార్లు స్టార్క్ చేతికి పూరన్ వికెట్ సమర్పించుకున్నాడు.
ఈ సమయంలో స్టార్క్ పూరన్‌కి వేసిన బంతులు కేవలం 14 మాత్రమే. ఈ 14 బంతుల్లో పూరన్ చేసిందల్లా 12 పరుగులే.
లక్నోలోని ఇకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లోనూ ఈ జోడీ మరోసారి హైలైట్ అయింది.
Details
పూరన్‌పై స్టార్క్ ఆధిపత్యం
మొదటి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన పూరన్, ఆ తర్వాత ఐదు బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.
బంతి బ్యాట్‌ను తాకి వికెట్లపై పడింది. దీంతో మళ్లీ పూరన్‌పై స్టార్క్ ఆధిపత్యాన్ని తేల్చేశాడు.
ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో పూరన్‌ను అత్యల్ప బంతుల్లోనే ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు.
అంతేకాక, స్టార్క్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు.
Details
తొమ్మిది ఇన్నింగ్స్ లో 377 పరుగులు
ఇక నికోలస్ పూరన్ విషయానికి వస్తే, ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 377 పరుగులు చేశాడు.
స్ట్రయిక్ రేట్ 204.89 కాగా, యావరేజ్ 47.12. ఈ సీజన్‌లో అత్యధికంగా 31 సిక్సర్లు కొట్టిన బ్యాటర్ కూడా పూరనే. అయితే వరుస ఫెయిల్యూర్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను కోల్పోయి ప్రస్తుతం రెండో స్థానానికి చేరుకున్నాడు.
మరోవైపు పర్పుల్ క్యాప్ పోటీలో ప్రసిద్ కృష్ణ 16 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, కుల్దీప్ యాదవ్ 12 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
మిచెల్ స్టార్క్ 11 వికెట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా చూస్తే, పూరన్ అంటే ఐపీఎల్‌లో బౌలర్లకు భయంగా ఉండొచ్చు.. కానీ స్టార్క్ మాత్రం పూరన్‌కే భయాన్ని కలిగిస్తున్నాడు!