Glen Maxwell: టీ20 జట్టు ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్ మాక్స్‌వెల్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 క్రికెట్ విస్తరణలో మరో కొత్త అడుగు పడింది. ప్రపంచవ్యాప్తంగా దేశవాళీ టీ20 లీగ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా 'యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్' (ఈటీపీఎల్) అనే కొత్త టోర్నీకి రూపం దాల్చింది. ఈ లీగ్ నిర్వహణకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా అనుమతి ఇచ్చింది. 'రూల్స్ గ్లోబల్' సంస్థతో కలిసి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహించనుంది. అభిషేక్ బచ్చన్ భాగస్వామ్యం ఈ లీగ్‌కు సంబంధించి బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్‌తో పాటు మరికొందరు వ్యాపారవేత్తలు 'రూల్స్ గ్లోబల్'లో భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే లీగ్‌లోని మూడు జట్ల యాజమాన్య ప్రక్రియ పూర్తైంది.
వివరాలు
స్టీవ్ వా - జేమీ డ్వేయర్ చేతుల్లో ఆమ్‌స్టర్‌డామ్
ఆమ్‌స్టర్‌డామ్ ఫ్రాంచైజీని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా సొంతం చేసుకున్నారు. ఆయనతో పాటు మూడు ఒలింపిక్ పతకాలు, రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న ఆస్ట్రేలియా హాకీ లెజెండ్ జేమీ డ్వేయర్ కూడా సహ యజమానిగా ఈ జట్టులో భాగస్వామ్యం కావడం విశేషం. ఎడిన్‌బర్గ్, బెల్‌ఫాస్ట్ యాజమాన్య వివరాలు ఎడిన్‌బర్గ్ జట్టును న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు నాథన్ మెకల్లమ్, కైల్ మిల్స్ కలిసి కొనుగోలు చేశారు. ఇక బెల్‌ఫాస్ట్ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు.
వివరాలు
ఆగస్టులో లీగ్ ప్రారంభం
ఈటీపీఎల్ టోర్నీ ఈ ఏడాది ఆగస్టులో జరగనుంది. ఇటీవలి కాలంలో యూరోప్ దేశాల్లో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని, ఈ లీగ్ మంచి విజయాన్ని సాధిస్తుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.