NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్
    తదుపరి వార్తా కథనం
    వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్
    వన్డేల్లో 5వేల పరుగులకు దగ్గరిలో ఉన్న స్టీవెన్ స్మిత్

    వన్డేల్లో అద్బుత రికార్డుకు చేరువలో స్టీవెన్ స్మిత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 21, 2023
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ వన్డేలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేలో 5వేల పరుగులు చేయడానికి కేవలం 61 పరుగుల దూరంలో ఉన్నాడు.

    టీమిండియాతో జరిగే మూడో వన్డేలో అతను ఈ ఫీట్ ను సాధించే అవకాశం ఉంది. వాంఖడేలో జరిగిన మొదటి వన్డేలో 22 పరుగులు చేశాడు. అయితే రెండో వన్డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో స్మిత్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

    ఈ ఫీట్‌ను స్మిత్ సాధిస్తే ఆస్ట్రేలియా తరుపున 5వేల పరుగులు పూర్తి చేసిన 17వ ప్లేయర్‌గా స్టీవెన్ స్మిత్ రికార్డు సృష్టించనున్నాడు. ఆస్ట్రేలియా తరుపున రికీ పాంటింగ్ 13,589 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

    స్టీవెన్ స్మిత్

    టీమిండియాపై స్టీవెన్ స్మిత్‌కు మెరుగైన రికార్డు

    141 వన్డేల్లో స్మిత్ 44.90 సగటుతో 4,939 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలను, 29 అర్ధసెంచరీలను బాదాడు. ఆస్ట్రేలియా తరుపున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో స్మిత్ ఆరో స్థానంలో ఉన్నాడు.

    వన్డేల్లో ఆస్ట్రేలియా తరుపున రికి పాంటింగ్ 29 సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.

    స్వదేశంలో స్మిత్ 59 వన్డేలు ఆడి 56.80 సగటుతో 2,613 పరుగులు చేశాడు. విదేశాల్లో 57 వన్డేలాడిన స్మిత్ 34.06 సగటుతో 1,601 పరుగులు చేశాడు.

    స్మిత్‌ కు టీమిండియాపై మెరుగైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన 23 వన్డేల్లో స్మిత్ 60.26 సగటుతో 1,145 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలను బాదాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టీవన్ స్మిత్
    క్రికెట్

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    స్టీవన్ స్మిత్

    మేజర్ లీగ్ క్రికెట్ ఆడనున్న స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా
    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించని స్టీవెన్ స్మిత్ క్రికెట్
    IND Vs AUS : స్టీవ్ స్మిత్‌కే చివరి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు క్రికెట్

    క్రికెట్

    ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ దూరమైన శ్రేయాస్ అయ్యర్.. క్లారిటీ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ శ్రేయస్ అయ్యర్
    అత్యంత అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ
    టీమిండియా, ఆస్ట్రేలియా వన్డే సమరానికి సర్వం సిద్ధం టీమిండియా
    వన్డేల్లో ఆస్ట్రేలియాపై రోహిత్‌కు మెరుగైన రికార్డు రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025