Page Loader
Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. టీ20లో అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. టీ20లో అరుదైన రికార్డు

Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. టీ20లో అరుదైన రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఇది వరకూ ఇంగ్లాండ్ దేశవాలీ క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడిన సమిత్ పటేల్‌ పేరిట ఈ రికార్డు ఉండగా.. ఇప్పుడు నరైన్ అదే స్థాయికి చేరాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ మూడు కీలక వికెట్లు తీసి తన మొత్తం వికెట్లను 208కు చేర్చాడు. దీంతో టీ20 క్రికెట్‌లో ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో సమిత్ పటేల్‌తో కలసి నెంబర్‌వన్ స్థానాన్ని పంచుకున్నాడు.

Details

ఒకే జట్టు తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా

సునీల్ నరైన్ (కేకేఆర్) - 208 వికెట్లు సమిత్ పటేల్ (నాటింగ్‌హామ్‌షైర్) - 208 వికెట్లు క్రిస్ వుడ్ (హాంప్‌షైర్) - 199 వికెట్లు లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్) - 195 వికెట్లు డేవిడ్ పెయిన్ (గ్లోసెస్టర్‌షైర్) - 193 వికెట్లు సునీల్ నరైన్ తీసిన 208 వికెట్లలో 190 వికెట్లు ఐపీఎల్‌లోని 186 మ్యాచ్‌ల్లో వచ్చాయి. మిగిలిన 18 వికెట్లు కేకేఆర్ తరఫున ఆడిన తొమ్మిది ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్‌ల్లో సాధించాడు. తాజా మ్యాచ్‌లో నరైన్‌ తన బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌తోనూ అలరించాడు. కేవలం 16 బంతుల్లో 27 పరుగులు చేసి విలువైన రన్స్ అందించాడు.