LOADING...
IPL 2026: వైభవ్‌ విధ్వంసం.. రాజస్థాన్‌ రాయల్స్ విక్టరీ
వైభవ్‌ విధ్వంసం.. రాజస్థాన్‌ రాయల్స్ విక్టరీ

IPL 2026: వైభవ్‌ విధ్వంసం.. రాజస్థాన్‌ రాయల్స్ విక్టరీ

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
11:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేటి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో మొదటగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ జట్టు భారీ స్కోర్‌ను నమోదు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు ధృవ్‌ జురెల్‌ కూడా వేగంగా ఆడి 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. అతడు 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. వీరిద్దరి దూకుడు బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.

వివరాలు

196 పరుగులకు ఆలౌట్..

అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు పోరాడినప్పటికీ విజయానికి చేరుకోలేకపోయింది. 19.2 ఓవర్లకు 196 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఒక దశలో రాజస్థాన్‌ స్కోర్‌ 260 నుంచి 270 పరుగుల మధ్యకు వెళ్లేలా కనిపించింది. అయితే చివరి ఐదు ఓవర్లలో వరుసగా వికెట్లు పడిపోవడంతో పరుగుల వేగం తగ్గిపోయింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో బ్యాటర్లు పూర్తిగా ఇబ్బంది పడ్డారు. ఆ 12 బంతుల్లో కేవలం 10 పరుగులే రావడం గమనార్హం. చివరి దశలో సాకిబ్‌ హుసేన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. భారీ లక్ష్య ఛేదన ప్రారంభించిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది.

వివరాలు

గుజరాత్‌తో రసవత్తర పోరుకు సిద్ధం..

ఇన్నింగ్స్‌ రెండో బంతికే అభిషేక్‌ శర్మ ఔటయ్యాడు. ఆర్చర్‌ వేసిన బంతిని వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతడు ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. ఇక ఆరెంజ్ ఆర్మీతో ఢీకొన్న రాయల్స్ జట్టు ఘన విజయం సాధించడంతో క్వాలిఫైయర్ 2లోకి చేరింది. క్వాలిఫైయర్2లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఆడనుంది.

Advertisement

వివరాలు

యువ సంచలనం..అద్బుత రికార్డు

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడు ఆటతో వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంకా పదహారేళ్లు కూడా నిండని ఈ యువ ఆటగాడు మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో క్రిస్ గేల్ ఒకడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2012 సీజన్‌లో గేల్ మొత్తం 59 సిక్సర్లు బాది అరుదైన ఘనత సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న వైభవ్ సూర్యవంశీ ఆ అసాధ్యాన్ని సాధించాడు.

Advertisement