Sunrisers New Coach: సన్ రైజర్స్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్.. లారాకు గుడ్‌బై!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇప్పటి నుంచే కొన్ని ఫ్రాంచేజీలు కసరత్తులు ప్రారంభిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫ్రాంచేజీలు తమ జట్లలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు హెడ్ కోచ్‌లను మార్చేశాయి.
తాజాగా సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న బ్రియాన్ లారాను యాజమాన్యం పక్కన పెట్టేసింది.
కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ దిగ్గజం డేనియల్ వెట్టోరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి బ్రియాన్ లారా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Details
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరిస్తున్న వెట్టోరి
డేనియల్ వెట్టోరి గతంలో రాయల్ చాలెంజర్ బెంగళూరు తరుపున ఆడిన విషయం తెలిసిందే.
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2014-2018 మధ్య ఆర్సీబీ హెడ్ కోచ్ కూడా పనిచేశాడు. వెట్టోరి నేతృత్వంలో ఆర్సీబీ 2015లో ఫ్లే ఆఫ్స్‌కి, 2016లో ఫైనల్ దాకా వెళ్లింది.
ప్రస్తుతం వెట్టోరి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.
బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్పేన్ హీట్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బర్బాడోస్ రాయల్స్ జట్టుకు కోచ్ గా ఉన్నాడు.
ఇక వెట్టోరి రాకతో సన్ రైజర్స్ హైదరాబాద్ 2024లో ఐపీఎల్ టైటిల్‌ను సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.