Womens Junior Asia Cup 2026: హ్యాట్రిక్‌తో అదరగొట్టిన సుప్రియ.. జూనియర్ ఆసియా కప్ ఫైనల్‌కు భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత జూనియర్ హకీ జట్లు అదరగొడుతున్నాయి. జూనియర్ ఆసియా కప్‌లో ఇప్పటికే పురుషుల జట్టు ఫైనల్‌కు చేరుకోగా.. తాజాగా మహిళల జట్టు కూడా అదే బాటలో పయనించింది. సెమీఫైనల్‌లో దక్షిణ కొరియాపై భారత్ ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి టీమ్‌ఇండియాకు కాస్త పోటీ ఎదురైంది. అయినప్పటికీ భారత జట్టు ఏమాత్రం తడబడకుండా 5-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. చైనా-జపాన్ జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్‌లో విజేతగా నిలిచే జట్టుతో భారత్ టైటిల్ పోరులో తలపడనుంది.
వివరాలు
సుప్రియ హ్యాట్రిక్..
అంతకుముందు క్వార్టర్‌ఫైనల్‌లో పాకిస్థాన్‌ను భారత్ 19-0 తేడాతో చిత్తుగా ఓడించింది. అదే జోరును సెమీఫైనల్‌లోనూ కొనసాగిస్తూ దక్షిణ కొరియాపై విజృంభించింది.
భారత్ విజయంలో సుప్రియ హ్యాట్రిక్ సాధించి కీలక పాత్ర పోషించింది. మధు సిదార్, సుఖ్వీర్ కౌర్ చెరో గోల్ చేసి జట్టు విజయానికి తమ వంతు సహకారం అందించారు.
దక్షిణ కొరియా తరఫున యురి జెంగో ఒక గోల్ చేసింది. చివరికి భారత్ 5-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.