
Surya kumar Yadav: సూర్య భాయ్ ఆగయా...ప్రత్యర్థులకు చుక్కలే
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి చేరాడు.
ఇటీవల అనారోగ్యం కారణంగా జట్టుకు దూరంగా ఉండటంతో ముంబయి ఇండియన్స్ జట్టు ఐపీఎల్ టోర్నీలో సరైన ప్రదర్శనను కనబరచలేకపోయింది.
గత రెండు వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు పూర్తి ఫిటెనెస్ను సంతరించుకున్నాడు.
ఇక శుక్రవారం నుంచే ముంబై ఇండియన్స్ జట్టులో చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు.
సూర్యభాయ్ రాకతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతమైంది.
ముంబై ఇండియన్స్ ఆడిన గత మూడు మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ తేలిపోయింది.
స్కై రాకతోనైనా ముంబై ఇండియన్స్ ఆటతీరు మారుతుందేమోనని ఆ జట్టు యాజమాన్యం, అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
Suryakumar Yadav
ఇప్పుడైనా ముంబై ఇండియన్స్ తలరాత మారేనా?
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లోనైనా ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు చెలరేగి ఆడతారేమో చూడాలి.
స్యూర కుమార్ యాదవ్ టీ 20 మ్యాచ్ల్లో ప్రత్యర్థులకు చుక్కులు చూపిస్తాడనడంలో సందేహం లేదు.
ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ యాదవ్ 85 ఇన్నింగ్స్లు ఆడి 2688 పరుగులు చేశాడు.
అందులో ఒక సెంచరీ, 20 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు.