తదుపరి వార్తా కథనం
SRH Vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ కి ఎదురు దెబ్బ
వ్రాసిన వారు
Stalin
Mar 26, 2024
04:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన పోరుకు ముందు ముంబై ఇండియన్స్ (MI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)ఎన్‌ఓసీ దక్కలేదని తెలుస్తోంది
ఈ అనూహ్య పరిణామం ముంబై ఇండియన్స్ ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు.
గుజరాత్ మ్యాచ్లో సూర్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతడు ఉండివుంటే ముంబై సునాయాసంగా గెలిచేది.
సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు.
ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్య.. ఎన్సీఏ వైద్య బృదం పర్యవేక్షణలో ఉన్నాడు.
ఐపీఎల్ లో 139 మ్యాచులు ఆడిన సూర్య.. 3249 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.