LOADING...
SKY : ముంబై స్టార్ ఇంట్లో పండుగ వాతావరణం.. తండ్రైన సూర్యకుమార్ యాదవ్
ముంబై స్టార్ ఇంట్లో పండుగ వాతావరణం.. తండ్రైన సూర్యకుమార్ యాదవ్

SKY : ముంబై స్టార్ ఇంట్లో పండుగ వాతావరణం.. తండ్రైన సూర్యకుమార్ యాదవ్

వ్రాసిన వారు Moogati Shabari
May 07, 2026
10:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబయి ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (SKY) ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా కొనసాగుతున్న సమయంలో సూర్య దంపతులకు మధురమైన శుభవార్త అందింది. ఆయన భార్య దేవిషా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో అభిమానులు, తోటి క్రికెటర్లు కొత్త తల్లిదండ్రులైన ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

వివరాలు

శుభవార్త కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..

సూర్యకుమార్ యాదవ్, దేవిషా శెట్టి 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రేమకథ కాలేజీ రోజుల్లోనే ప్రారంభమైంది. ముంబైలో చదువుకుంటున్న సమయంలో దేవిషా చేసిన డ్యాన్స్ ప్రదర్శనకు ఆకర్షితుడైన సూర్య, ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని చివరికి వివాహం చేసుకున్నారు. పెళ్లైన పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ జంట తొలిసారి తల్లిదండ్రులుగా మారారు. ఈ ఏడాది మార్చిలో దేవిషా బేబీ షవర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పటి నుంచే అభిమానులు ఈ శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివరాలు

అద్భుతమైన కొత్త ఇన్నింగ్స్..

2026 సంవత్సరం సూర్యకుమార్ యాదవ్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఆయన కెప్టెన్సీలోనే టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా విజయాలు అందుకున్న సూర్యకు ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయి. మైదానంలో 360 డిగ్రీల షాట్లతో బౌలర్లను ఇబ్బంది పెట్టే సూర్య, తన కుమార్తె రాకతో జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు.

Advertisement

వివరాలు

ఆర్సీబీ మ్యాచ్‌కు దూరం..

ఇక ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భార్య ప్రసవం కారణంగా సూర్య జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు వెళ్లలేదని సమాచారం. దీంతో ఆర్సీబీతో జరిగే కీలక మ్యాచ్‌కు ఆయన దూరమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబంతో గడపాలని సూర్య నిర్ణయించుకున్నారని, దీనికి ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement