SA vs IND: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. రికార్డుల వేటలో అర్ష్‌దీప్,సూర్యకుమార్ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది.
గత టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు పోటీపడగా, భారత్ విజేతగా నిలిచింది.
ఈ సారి, ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా నాలుగు టీ20 మ్యాచులు ఆడనుంది.
పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు పైచేయి ఉన్నప్పటికీ, ఈ సిరీస్‌లో గట్టి పోటీని ఇవ్వడానికి దక్షిణాఫ్రికా జట్టు సిద్ధమైంది. శుక్రవారం డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో కొన్ని అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నాడు.
2021లో టీ20ల్లో అరంగేట్రం చేసిన సూర్య ఇప్పటి వరకు 74టీ20 మ్యాచుల్లో 2,544 పరుగులు చేయగా, 169.48స్ట్రైక్ రేట్‌తో నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు సాధించాడు.
వివరాలు
అరుదైన రికార్డులకు దూరంలో అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా పై సూర్య 346 పరుగులు చేశాడు, కేవలం ఏడు మ్యాచుల్లోనే 175.63 స్ట్రైక్ రేట్ సాధించాడు.
మరో 107 పరుగులు చేస్తే భారత్ - దక్షిణాఫ్రికా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ 452 పరుగులతో ముందున్నాడు. ఈ సిరీస్‌లో కనీసం ఆరు సిక్సులు కొడితే 150 సిక్సులు సాధించిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు, ఇప్పటివరకు మార్టిన్ గప్తిల్ (173), రోహిత్ శర్మ (205) ముందున్నారు.
మరోవైపు, భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా అరుదైన రికార్డులను సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇప్పటివరకు 56 అంతర్జాతీయ టీ20ల్లో 87 వికెట్లు తీసిన అర్ష్‌దీప్, మరో 13 వికెట్లు తీస్తే తన వికెట్లను 100కి చేరుస్తాడు.