Page Loader
T20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు 
T20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు

T20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు 

వ్రాసిన వారు Stalin
Jul 04, 2024
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు గురువారం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అతని టీమ్ సభ్యలు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం ముంబయికి వెళ్లనున్నారు. మంబైలో సాయంత్రం టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది. భారత క్రికెట్ జట్టు బార్బడోస్ నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా చార్టర్డ్ విమానంలో దిల్లీకి చేరుకుంది. టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కరేబియన్ ద్వీపంలో 3 రోజుల నిరీక్షణ తర్వాత, టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో ఇంటికి తిరిగి వచ్చారు. చార్టర్డ్ విమానం నుంచి ఆటగాళ్లు ట్రోఫీని తీసుకుంటున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

క్రికెట్

అభిమానుల స్వాగతం

ఎయిర్‌పోర్టులో భారీ సంఖ్యలో అభిమానులు జట్టుకు స్వాగతం పలికారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన చేతిలో ట్రోఫీతో విమానాశ్రయంలో అభిమానులకు అభివాదం తెలిపాడు. బెరిల్ హరికేన్ కారణంగా ఎయిర్‌పోర్ట్ మూతపడటంతో గౌరవనీయమైన టైటిల్‌ను గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ బార్బడోస్‌లో నాలుగు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత, ప్రపంచ ఛాంపియన్‌లను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక ఎయిర్ ఇండియా చార్టర్డ్ విమానాన్ని బార్బడోస్‌కు పంపారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు అర్థరాత్రి నుంచి పెద్ద క్యూలలో వేచి ఉండటంతో జట్టు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. విమానాశ్రయంలోనూ, టీమ్‌ హోటల్‌లోనూ రోహిత్ బృందానికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post