Page Loader
టాటా సఫారి v/s మహీంద్రా XUV700 : ఫీచర్లు ఎందులో ఎక్కువ
టాటా సఫారి, మహీంద్రా కారు

టాటా సఫారి v/s మహీంద్రా XUV700 : ఫీచర్లు ఎందులో ఎక్కువ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్ ఇటీవల ఇండియాలో సఫారీ 2023 వెర్షన్‌ను పరిచయం చేసింది. ఫ్లాగ్‌షిప్ కారు స్టైలిష్ డిజైన్‌తో అద్భుతంగా ఉంది. ప్రయాణీకుల కోసం మరింత భద్రతగా ADAS సూట్‌ను ఇందులో పొందుపరిచింది. మార్కెట్లో మహీంద్రా వెహికల్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం XUV700 మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ADAS సూట్‌లో భాగంగా, 2023 టాటా సఫారి ఇండియాలో 10 భద్రతా సౌకర్యాలతో ముందుకొచ్చింది. వాటిలో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్టెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, డోర్ ఓపెన్ అలర్ట్ ఉండడం విశేషం.

మహీంద్రా

XUV700లో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు

మహీంద్రా XUV700 అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో ముందుకొచ్చింది. ట్రాఫిక్ సైన్ గుర్తింపు, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ పైలట్ అసిస్ట్ కూడా ఇందులో ఉన్నాయి. టాటా సఫారీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, క్రాష్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-డీసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సేఫ్టీ మౌంట్‌లు ఉన్నాయి. ఇందులో 360-డిగ్రీ-వ్యూ కెమెరా ఉండడం విశేషం. XUV700లో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక వైపున కెమెరా, ABS, EBD, టైర్ ప్రెజర్ మానిటర్, క్రాష్ సెన్సార్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌లైట్లు, బ్లైండ్‌స్పాట్ మానిటర్‌తో అందుబాటులో ఉండనున్నాయి.