Loading...
Team India: టీమిండియా ఆలౌట్‌.. 462 పరుగుల వద్ద ముగిసిన తొలి ఇన్నింగ్స్‌!
టీమిండియా ఆలౌట్‌.. 462 పరుగుల వద్ద ముగిసిన తొలి ఇన్నింగ్స్‌!

Team India: టీమిండియా ఆలౌట్‌.. 462 పరుగుల వద్ద ముగిసిన తొలి ఇన్నింగ్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. రెండో రోజు 460/9తో ఆట ముగించిన భారత్‌.. మూడో రోజు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. ప్రసిద్ధ్‌ కృష్ణను అసిత ఫెర్నాండో ఔట్‌ చేయడంతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత్‌ భారీ స్కోరులో దేవ్‌దత్‌ పడిక్కల్‌ కీలక పాత్ర పోషించాడు. అతడు 167 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 82 పరుగులు చేయగా.. ధ్రువ్‌ జురెల్‌ 51 పరుగులతో అర్ధశతకం సాధించాడు.

వివరాలు

భారీ శతకం సాధించిన పడిక్కల్

రిషభ్‌ పంత్‌ 39 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య అత్యుత్తమంగా రాణించాడు. అతడు 109 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

కేశర నువంత మూడు వికెట్లు సాధించగా.. అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీశాడు.

వర్షం కారణంగా రెండో రోజు ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడినప్పటికీ.. పడిక్కల్‌ భారీ శతకం, రాహుల్‌, జురెల్‌ కీలక ఇన్నింగ్స్‌లతో భారత్‌ 462 పరుగుల బలమైన స్కోరు సాధించింది.

ADVERTISEMENT