Loading...
Virat Kohli : లార్డ్స్‌కు చేరుకున్న టీమిండియా.. జట్టును వదిలి నేరుగా ఇంటికెళ్లిన విరాట్ కోహ్లీ!
లార్డ్స్‌కు చేరుకున్న టీమిండియా.. జట్టును వదిలి నేరుగా ఇంటికెళ్లిన విరాట్ కోహ్లీ!

Virat Kohli : లార్డ్స్‌కు చేరుకున్న టీమిండియా.. జట్టును వదిలి నేరుగా ఇంటికెళ్లిన విరాట్ కోహ్లీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ఆదివారం లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో చివరి వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. సిరీస్‌ను కైవసం చేసుకునే లక్ష్యంతో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే లార్డ్స్‌కు చేరుకున్నాయి. టీమిండియా లండన్ చేరుకున్న దృశ్యాలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. అయితే ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన పని అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

వివరాలు

ప్రైవేటు కారులో వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ

జట్టు బస్సు హోటల్‌కు చేరుకున్న తర్వాత ఇతర ఆటగాళ్లంతా నేరుగా హోటల్‌లోకి వెళ్లగా, కోహ్లీ మాత్రం వారితో కలిసి వెళ్లకుండా బయట వేచి ఉన్న ప్రైవేట్ కారులో బయలుదేరాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, కోహ్లీ లండన్‌లోని తన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా ఆయన తన కుటుంబంతో కలిసి లండన్‌లోనే నివసిస్తున్నారు.

భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికా, కుమారుడు అకాయ్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినట్లు సమాచారం.

మూడో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ మళ్లీ టీమిండియాతో చేరనున్నట్లు తెలుస్తోంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT