తదుపరి వార్తా కథనం
IND vs SA : మూడో టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 14, 2025
10:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 15.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 28 పరుగులు చేయగా, తిలక్ వర్మ 25 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను భారత్ కట్టడి చేసింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
3RD T20I. India Won by 7 Wicket(s) https://t.co/AJZYgMAHc0 #TeamIndia #INDvSA #3rdT20I @IDFCfirstbank
— BCCI (@BCCI) December 14, 2025