తదుపరి వార్తా కథనం

IND vs UAE: యూఏఈను చిత్తు చేసిన టీమిండియా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 10, 2025
09:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో భాగంగా మొదటి మ్యాచులో టీమిండియా శుభారంభం అందించింది. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య చేధనలో భారత్ కేవలం 4.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (30), గిల్(20*), సూర్యకుమార్ యాదవ్ (7*) పరుగులు చేశారు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ 4, శివమ్ దూబే 3 వికెట్స్ పడగొట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
9 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
Asia Cup T20 2025. 4.3: Simranjeet Singh to Shubman Gill 4 runs, India 60/1 https://t.co/Bmq1j2LGnG #INDvUAE #AsiaCup2025
— BCCI (@BCCI) September 10, 2025