Page Loader
ప్రపంచకప్ 2023 ముంగిట గుడ్ న్యూస్.. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మళ్లీ నెం.1గా సిరాజ్
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మళ్లీ నెం.1గా సిరాజ్

ప్రపంచకప్ 2023 ముంగిట గుడ్ న్యూస్.. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మళ్లీ నెం.1గా సిరాజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 20, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆసియా కప్‌-2023 ఫైనల్లో బ్రాహ్మాండంగా బౌలింగ్ చేసి రికార్డులను సృష్టించాడు. ఈ మేరకు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఒకేసారి 8 స్థానాలను ఎగబాకాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ని వెనక్కి నెట్టి 694 పాయింట్లతో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ టాప్‌-5లో వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ 1. మహ్మద్‌ సిరాజ్‌- భారత్ - 694 పాయింట్లు 2. జోష్‌ హాజిల్‌వుడ్‌- ఆస్ట్రేలియా - 678 పాయింట్లు 3. ట్రెంట్‌ బౌల్ట్‌- న్యూజిలాండ్‌ - 677 పాయింట్లు 4. ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ - అఫ్గనిస్తాన్‌- 657 పాయింట్లు 5. రషీద్‌ ఖాన్‌- అఫ్గనిస్తాన్‌- 655 పాయింట్లు

details

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు 

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హోరెత్తిస్తోంది. ఇటు బ్యాటింగ్‌ విభాగంలోనూ యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌ బాబర్‌ ఆజమ్‌కు దగ్గరయ్యాడు. 857 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న బాబర్ ను గిల్‌ (814) త్వరలోనే దాటేయనున్నాడు. దాయాది బ్యాటర్ల మధ్య కేవలం ​43 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. మరోవైపు ఎల్లుండి నుంచి ఆసీస్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్‌ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఆసియా కప్‌ తో జోరు మీదున్న భారత్‌, 115 పాయింట్లతో పాకిస్తాన్‌తో కలిగి రెండో స్థానంలో ఉంది. 22న కంగారులతో జరిగే తొలి వన్డేలో గెలిస్తే, భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. దీంతో టెస్టు, టీ-20, వన్డేలు కలిపి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా రికార్డులకెక్కుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టాప్ ర్యాంక్ వచ్చినందుకు టీమిండియాకు ధన్యవాదాలు తెలిపిన సిరాజ్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సూపర్ స్పెల్ తో శ్రీలంక పతనాన్ని శాసించిన ఫాస్ట్ బౌలర్ సిరాజ్