Page Loader
టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు.. కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్
కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్

టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు.. కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 19, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాపై మాజీ స్టార్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. కొత్తబంతితో భారత బౌలింగ్ అటాక్ అద్భుతమని కొనియాడారు. ఆసియా కప్ ఫైనల్‌లో ఆతిథ్య శ్రీలంకను కేవలం 50 పరుగులకే కుప్పకూల్చడంలో భారత పేస్‌ ధళం కీలక పాత్ర పోషించారు. ఈ మేరకు పది వికెట్లనూ ఫేసర్లే పడగొట్టారు. ఇందులో మహమ్మద్ సిరాజ్‌ ఆరు వికెట్లు కూల్చగా, హార్దిక్ 3 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. మొన్నటి వరకు పాకిస్థాన్‌ పేస్ దళం గురించే అంతా మాట్లాడుకునే వారని, ఇప్పుడు భారత ఫాస్ట్‌ బౌలింగ్‌ అద్భుతంగా ఆవిర్భవించిందని కీర్తించారు. ఇంకెప్పుడూ పాకిస్తాన్ పేస్‌ బౌలింగ్‌తో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని ఈ దిగ్గజ క్రికెటర్ స్పష్టం చేశాడు.

details

బుమ్రా రాకతో ఫేస్ బౌలింగ్ పదునెక్కింది :  గవాస్కర్

గతంలో టీమిండియాకు ఇంతటి పటిష్టమైన బౌలింగ్‌ అటాక్ ఉన్నట్లు నాకైతే గుర్తుకు రావట్లేదని సునీల్ గవాస్కర్ అన్నారు. కొత్త బంతితో భారత బౌలర్లు నాణ్యమైన ఫేస్ దాడిని కలిగి ఉన్నారన్నారు. క్రికెట్ అభిమానులు ఎక్కువగా పాక్‌ పేస్ బౌలింగ్‌ గురించే మాట్లాడుతుంటారన్న గవాస్కర్, బుమ్రా రాకతో ఇండియన్ పేస్ ఎటాక్‌ పదునెక్కిందన్నారు. ఆరంభంలో బుమ్రా వికెట్లు తీయకపోయినా, ఒత్తిడి మాత్రం పెంచగలడన్నారు. జట్టుకు షమీ లాంటి సీనియర్‌ ఫాస్ట్ బౌలర్‌ ఉన్న విషయం మరిచిపోవద్దని ఆయన గుర్తు చేశారు. తుది జట్టులో షమీ ఆడకపోయినా సరే, భారత రిజర్వ్‌ బలగం బలంగా మారిందన్నారు.ఇప్పటి వరకు భారత ఫేస్ విభాగంపై ఆందోళన ఉండేదని, శ్రీలంకతో మ్యాచ్ చూశాక, భారత బౌలింగ్ బలం ఏంటో తెలిసిందన్నారు.