India vs Malaysia: 17 బంతుల్లో మ్యాచ్‌ను ముగించిన టీమిండియా.. ప్రపంచకప్‌లో అదిరిపోయే విజయం
ఈ వార్తాకథనం ఏంటి
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత విజయాలను సాధిస్తోంది. రెండో మ్యాచ్‌లో టీమిండియా మలేషియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
ఈ మ్యాచ్ కౌలాలంపూర్‌లోని బ్యుమాస్ ఓవల్‌లో జరిగింది. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మలేషియా జట్టు కేవలం 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్ వైష్ణవి శర్మ అద్భుత ప్రదర్శనతో మెరిసింది. ఆమె కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.
మలేషియా జట్టులో నలుగురు బ్యాటర్లు డక్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2.5 ఓవర్లలో చేధించింది.
Details
పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
ఓపెనర్ జి త్రిష 12 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచింది.
ఈ విజయంతో టీమిండియా మ్యాచ్‌ను అతి తక్కువ సమయంలో ముగించి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా, రెండో మ్యాచ్‌లో కూడా భారీ విజయంతో గ్రూప్ 1లో 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
ఈ టోర్నమెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అలాగే డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ అందుబాటులో ఉంది.