Page Loader
టీ20లో సక్సస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్
2022లో రికార్డులను సృష్టించిన టీమిండియా ఆటగాళ్లు

టీ20లో సక్సస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2022
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది భారత జట్టులోని టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రోహిత్‌శర్మ స్థానంలో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన రాహుల్ బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించి, తన మొదటి టెస్టు సిరీస్ ను గెలుచుకున్నారు. రోహిత్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ అరుదైన ఘనతను సాధించాడు. ఒక ఏడాదిలో అత్యధిక 21 టీ20లు గెలిచి రోహిత్ రికార్డును సృష్టించాడు. ధోని 2016లో 15 విజయాలను అందించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో కోహ్లి అత్యధిక పరుగులు చేశాడు. 27 మ్యాచ్‌ల్లో 1,141 పరుగులతో మొదటి స్థానం సంపాదించాడు. టీ20లో 4,000 పరుగులు చేసి శబాష్ అనిపించుకున్నాడు. ఐసీసీ ప్రపంచకప్ నాకౌట్‌లలో 361 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు

రిషబ్ పంత్

మొదటి ఇండియన్ కీపర్‌గా రిషబ్ పంత్ రికార్డు

2022 T20లో సూర్యకుమార్ యాదవ్ 1000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సూర్య తన రెండో టీ20లో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే ఏడాదిలో 11 అర్ధసెంచరీలు చేసి సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్ రికార్డును చేరిపేశాడు వికెట్ కీపర్ రిషబ్‌పంత్ టెస్టులో మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ ఏడాది టెస్టులో 680 పరుగులు చేసిన భారతీయ తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. గతేడాది 12 టెస్టులాడిన పంత్ 748 పరుగులు చేసిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ తన T20 ప్రపంచకప్ అరంగేట్రంలోనే తొలి బంతికే వికెట్ తీసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. అంతకముందు మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ ఘనతకు సాధించాడు.