LOADING...
IND w vs SA w : షెఫాలి, దీప్తి మెరుపులు.. సఫారీల లక్ష్యం ఎంతంటే?
రాణించిన టీమిండియా బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

IND w vs SA w : షెఫాలి, దీప్తి మెరుపులు.. సఫారీల లక్ష్యం ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
08:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత ఇన్నింగ్స్‌ పూర్తి అయింది. టాస్‌లో ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ 87 పరుగులతో చెలరేగగా, దీప్తి శర్మ 58 పరుగులతో అర్ధశతకం సాధించింది. స్మృతి మంధాన 45, జెమిమా రోడ్రిగ్స్‌ 24, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 20 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్‌ ఆడారు. చివర్లో రిచా ఘోష్‌ 34 పరుగులతో వేగంగా రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాక అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా, ఎంలబా, క్లెర్క్‌, ట్రయాన్‌ చెరో వికెట్‌ తీశారు.