LOADING...
AUS vs IND : ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

AUS vs IND : ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడో టీ20లో టీమిండియా ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌, 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. భారత బ్యాటింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (49 నాటౌట్‌; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగి ఆఖరి వరకు నిలిచాడు. తిలక్‌ వర్మ (29; 26 బంతుల్లో, 1 ఫోర్‌, 1 సిక్స్‌), అభిషేక్‌ శర్మ (25; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌(24; 11 బంతుల్లో, 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆరంభంలోనే భారత జట్టు దూకుడుగా ఆడింది.

Details

చివర్లో విజృంభించిన సుందర్

తొలి రెండు ఓవర్లలో అభిషేక్‌ శర్మ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆయన (25; 16 బంతుల్లో) నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో (3.3 ఓవర్లు) వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (15) కూడా ఎల్లిస్‌ బౌలింగ్‌లోనే (5.3 ఓవర్లు) ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. రెండో మ్యాచ్‌లో విఫలమైన గిల్‌, మూడో మ్యాచ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మంచి టచ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ (24) స్టాయినిస్‌ బౌలింగ్‌లో (7.3 ఓవర్లు) ఎల్లిస్‌ చేతిలో క్యాచ్‌ అయ్యాడు. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (49 నాటౌట్‌) జితేశ్‌ శర్మ (22)తో కలిసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

Details

హాఫ్ సెంచరీలతో రాణించిన టిమ్ డేవిడ్, స్టోయినిస్

త్రుటిలో హాఫ్‌సెంచరీని చేజార్చుకున్న సుందర్‌ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ హీరోగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్‌ ఎల్లిస్‌ 3 వికెట్లు తీశాడు. జేవియర్‌ బ్రేట్‌లెట్‌, మార్కస్‌ స్టాయినిస్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ముందుగా టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (74) మరియు మార్కస్‌ స్టాయినిస్‌ (64) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్‌ చక్రవర్తి 2 వికెట్లు, శివమ్‌ దూబె ఒక వికెట్‌ తీశారు.