SL vs IND: శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్.. నెట్ బౌలర్లుగా నలుగురు యువ స్పిన్నర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా-శ్రీలంక (SL vs IND) మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు మెరుగ్గా సిద్ధమయ్యేలా నలుగురు యువ స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. ఈ జాబితాలో విప్రాజ్ నిగమ్, తనుష్ కొటియన్, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్ ఉన్నారు. వీరంతా సోమవారం భారత జట్టుతో కలిసి శ్రీలంకకు బయలుదేరారు. టూర్ మొత్తం ఈ నలుగురు యువ స్పిన్నర్లు నెట్స్‌లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేసి మ్యాచ్‌లకు సిద్ధం చేయనున్నారు.
వివరాలు
ఆగస్టు 15న తొలి టెస్టు ప్రారంభం
ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఏ' జట్టు తరఫున ముక్కోణపు సిరీస్‌లో విప్రాజ్ నిగమ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
ఇదే సమయంలో ప్రధాన జట్టులో ఇప్పటికే అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ ఉన్నారు.
వీరికి తోడుగా మానవ్ సుతార్, సరాంశ్ జైన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ ఆగస్టు 7 నుంచి కొలంబోలో శ్రీలంక ఎలెవన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
అనంతరం తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమవుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది.