Page Loader
పసిడితో మెరిసిన భారత బృందం
పసిడి సాధించిన భారత బృందం

పసిడితో మెరిసిన భారత బృందం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2023
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ను భారత్ ఘనంగా ముగించింది. భారత బృందం సభ్యులు ఏకంగా పసిడి తో మెరిశారు. బుధవారం జరిగిన మహిళల 4X400 మీటర్ల ఫైనల్‌ రేసులో అనుష్క, రియాస్, కనిస్తా, రెజోనా కూడిన భారత బృందం 3:40:50 సెకన్ల సమయంలో స్వర్ణాన్ని సాధించి సత్తా చాటారు. అదే విధంగా కజకిస్థాన్, కోరియా జట్లు వరుసగా రజత, కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మహిళలు స్వర్ణం సాధించడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిసింది.

Details

ఈ టోర్నీలో 6 స్వర్ణాలు సాధించిన భారత్

మహిళల 1500 మీటర్ల ఫైనల్లో లక్షిత 4:24:23 సెకన్ల సమయంలో భారత్ కు స్వర్ణాన్ని అందించడం విశేషం. మరోవైపు పురుషుల విభాగంలో మెహదీ హసన్ 3:56:01 సెకన్ల సమయంలో కాంస్య పతకాన్ని సాధించాడు. పురుషుల 4X400 మీటర్ల చివరి రేసులో దీపక్‌సింగ్‌, శరణ్‌, రిహాన్‌ చౌదరీ, నవ్‌ప్రీత్‌సింగ్‌ 3:08:79సెకన్ల టైమింగ్‌తో రజతం సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత్ 6 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్య పతకాలు సాధించింది. దీంతో ఈ మెగా ఈవెంట్ లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇందులో గెలుపొందిన సభ్యులకు జాతీయ కోచ్ నాగపురి రమేష్ అభినందనలు తెలిపారు.