LOADING...
Smriti Mandhana: త్వరలో ఇండోర్ కోడలు కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన
త్వరలో ఇండోర్ కోడలు కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన

Smriti Mandhana: త్వరలో ఇండోర్ కోడలు కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మహిళా జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ 'స్మృతి మంధాన' తన ఆటతీరుతో మాత్రమే కాకుండా, పర్సనల్ లైఫ్ అంశాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి ఇప్పటికే అందరికీ తెలిసింది. తాజాగా ఈ జంట పెళ్లి గురించి పలాష్ ముచ్చల్ స్వయంగా కీలక హింట్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్‌లో మహిళా ప్రపంచ కప్ 2025 జరగగా, మ్యాచ్‌లకు ముందే ఇండోర్‌కు చేరిన పలాష్ ముచ్చల్ ఓ స్టేట్ ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ఆమె త్వరలో ఇండోర్ కోడలు కాబోతోంది. నేను చెప్పదలుచుకున్నది ఇదే.

Details

పలాష్-స్మృతి సంబంధం

మీకు నేను హెడ్‌లైన్ ఇచ్చానని ఉల్లాసంగా చెప్పారు. పలాష్ స్వయంగా ఇండోర్‌కు చెందినవారు కావడం వల్ల, స్మృతి మంధాన ముచ్చల్ కుటుంబంలోకి అడుగుపెట్టడం ద్వారా ఇండోర్ కోడలు అవుతారని స్పష్టం చేశారు. ఇది ఈ జంట పెళ్లి విషయంపై ఓ సేలబ్రిటీ వేదికపై చెప్పడం మొదటిసారి. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ తరచుగా తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒకరితో ఒకరు దిగిన ఫోటోల ద్వారా తమ రిస్పెక్ట్‌ఫుల్ రిలేషన్‌షిప్‌ను హింట్‌ చేసేవారు. కొంతకాలంగా ఈ బంధంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, పలాష్ ముచ్చల్ శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించారు. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే తేదీలు ఇంకా తెలియనిప్పటికీ జంట త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెడతారని పలాష్ స్పష్టంగా చెప్పారు.

Details

 క్రికెట్ పై ప్రేమ 

పెళ్లి వార్తలతో పాటు, పలాష్ ముచ్చల్ క్రికెట్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఆదివారం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగే మహిళా ప్రపంచ కప్ మ్యాచ్ కోసం టీమిండియాకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. "నా శుభాకాంక్షలు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మొత్తం జట్టుకు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్ గెలిచేలా మేము ఎల్లప్పుడూ కోరుకుంటామని పలాష్ చెప్పారు. ఇంతలో స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై కేవలం 66 బంతుల్లో 80 పరుగులు సాధించి, వన్డే క్రికెట్‌లో 5000 పరుగుల మైలురాయిను కూడా పూర్తి చేశారు. క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో నిలిచిన ఈ స్టార్ ప్లేయర్, త్వరలో వైవాహిక జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.