IND w vs SA w : ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ట్రోఫీ కలను ఈసారి సాకారం చేసింది. ముంబయిలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 87 పరుగులతో, దీప్తి శర్మ 58 పరుగులతో అద్భుతంగా రాణించారు. లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
Details
5 వికెట్లు పడగొట్టిన దీప్తిశర్మ
లారా వోల్వార్ట్ (101) శతకంతో ప్రతిఘటించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించగా, షఫాలీ వర్మ 2 వికెట్లు, శ్రీ చరణి ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచకప్ కప్‌ను ఎత్తిపట్టింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
52 పరుగుల తేడాతో ఘన విజయం
India beat South Africa in a tense finale to become the #𝐂𝐖𝐂𝟐𝟓 𝐖𝐢𝐧𝐧𝐞𝐫𝐬 🏆🇮🇳#INDvSA 📝: https://t.co/6Vok7HLZsk pic.twitter.com/62p6cUwnJo
— ICC (@ICC) November 2, 2025