రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి హార్ధిక్ సేన ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 99 పరుగుల టార్గెట్ ను భారత్ కష్టంగా చేధించింది.
బౌలింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్‌లో ఈజీ టార్గెట్‌ను చేధించడానికి టీమిండియా బ్యాట్స్‌మెన్స్ కష్టపడ్డారు. ఈ గెలుపుతో మూడు టీ20ల మ్యాచ్ సిరీస్‌ను 1-1తో ఇండియా సమం చేసింది.
తక్కువ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మళ్లీ శుభారంభం లభించలేదు. శుబ్ మన్ గిల్ (11), రాహుల్ త్రిపాఠి (13), ఇషాన్ కిషన్ (19), వాషింగ్టన్ సుందర్ (10) విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు.
టీమిండియా
కివీస్ బ్యాటర్ల నడ్డి విరిచిన టీమిండియా బౌలర్లు
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు సహకరించడంతో భారత స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఫిన్ అలెన్ (11)ను యుజువేంద్ర చహల్ పెవిలియన్‌కు పంపిన కాసేపటికే డెవోన్ కాన్వే (11)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు.
గ్లెన్ ఫిలిప్స్ (5)ను దీపక్ హుడా బౌల్డ్ చేశాడు. ఇక తొలి టి20 హీరో డారిల్ మిచెల్‌ను కుల్దీప్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కివిస్ 99 పరుగులను మాత్రమే చేసింది.
భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. చహల్, వాషింగ్టన్ సుందర్, యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.