Page Loader
వాషింగ్టన్ సుందర్ మెరిసినా, టీమిండియా పరాజయం

వాషింగ్టన్ సుందర్ మెరిసినా, టీమిండియా పరాజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2023
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

రాంచి వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇండియా.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత్ టాపార్డర్ విఫలం కాగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌సుందర్ (28 బంతుల్లో 50) 5ఫోర్లు, 3 సిక్సర్లతో ఒంటరి పోరాటం చేశారు. సుందర్‌కి టీ20ల్లో ఇది మొదటి హాప్ సెంచరీ కావడం గమనార్హం. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో సూర్యకుమార్ (34 బంతుల్లో 47) హార్ధిక్‌పాండ్యా (20 బంతుల్లో 21) పరుగులు చేసి 68 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఆడుతున్న సమయంలో టీమిండియా లక్ష్యం వైపు సాగినట్లు కనిపించినా ఫలితం లేకుండా పోయింది.

వాషింగ్టన్ సుందర్

వాషింగ్టన్ సుందర్ పోరాటం

ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లపై బౌండరీలపై వర్షం కురిపించాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో భారత్‌ను మళ్లీ విన్నింగ్ రేసులో నిలిపాడు. మరో ఎండ్‌లో భారత్ వికెట్లు కోల్పోతున్నా.. సుందర్ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. చివరి ఓవర్లో ఎక్కువ పరుగులు కావాల్సి ఉండటంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లోనూ సుందర్ అదరగొట్టాడు. నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తన రెండో ఓవర్లో కివీస్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్‌ను అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ, రెండు వికెట్లు తీసిన నాలుగో భారతీయుడిగా సుందర్ నిలిచాడు.