
MS Dhoni : వీడ్కోలు కన్నా, ధోనికి జట్టు ప్రయోజనాలే ముఖ్యం : సునీల్ గవాస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటతీరు ఈసారి అభిమానులను ఆశించలేదు.
ఇప్పటికే ప్లేఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయిన సీఎస్కే, ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది.
కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించినా జట్టు ఫలితాల్లో పెద్ద మార్పు రాలేదు. ధోనీకిదే ఇది చివరి సీజన్ కావచ్చనే ఊహగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మరోమారు విభిన్నంగా స్పందించాడు.
ధోనీ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవేనని, అతను ఎప్పటికప్పుడు జట్టు ప్రయోజనాన్ని ముందు పెట్టే నిర్ణయాలను తీసుకుంటాడని గావస్కర్ అన్నారు.
Details
సీఎస్కే కు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటాడు
'ఏ ప్లేయర్ అయినా సరే, తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాన్ని ముందుపెట్టే నిర్ణయాలు తీసుకుంటాడు. ధోనీ ఈ సీజన్‌లో ఆడాలని నిర్ణయించడం కూడా అందులో భాగమే.
సీఎస్కేకు ఏది మంచిది అనేది ఆలోచించి, అది తాను చేస్తాడు. భవిష్యత్తులో కూడా ఏ నిర్ణయాన్ని తీసుకుంటే, అది CSK కు ఉపయోగకరమేనా? కాదా? అనే దానిపై ఆలోచిస్తాడని గవాస్కర్ చెప్పారు.
Details
బౌలింగ్‌పై దృష్టి పెట్టాలి
ఈ సీజన్‌లో CSK ఆటతీరు ఎక్కువగా దూకుడుగా లేకుండా ఉంది. ముఖ్యంగా బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వచ్చే సీజన్‌లో బలంగా రావాలంటే బౌలింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. ఈసారి ఆక్షన్ స్ట్రాటజీలో CSK కొన్ని జట్ల కంటే వెనుకబడి కనిపించింది.
బహుశా టాలెంట్‌ను గుర్తించడం మరియు ఎంపికలలో ఇతర జట్ల కంటే CSK మెరుగు కావాల్సిన అవసరం ఉంది. కేవలం బ్యాటర్ల పైనే ఆశలు పెట్టుకోకూడదు.
బౌలింగ్ చాలా కీలకమైనది. నియమితంగా వికెట్లు తీసే బౌలర్ల ఎంపిక అవసరం. వచ్చే సీజన్ ముందు మినీ వేలం ఉంటుంది, అప్పటికప్పుడు బౌలింగ్ యూనిట్‌ను బలోపేతం చేసుకోవాలని సునీల్ గావస్కర్ సూచించారు.