Asian Games 2023: చరిత్ర సృష్టించిన తేజస్విన్ శంకర్.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. తాజాగా డెకాథ్లాన్ భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ 7666 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించాడు. దీంతో తేజస్విన్ చరిత్ర సృష్టించాడు. జపాన్‌కు చెందిన యము మారుయామా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ఈ చారిత్రాత్మక రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ఈ మూడు ఈవెంట్‌లలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలు నమోదు చేసి తేజస్విన్ సంచలన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
12 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన తేజస్విన్
అతను డిస్కస్ త్రోలో 39.28, షాట్‌పుట్‌లో 13.39 విసిరాడు. పోల్ వాల్ట్‌లో 4.10 మీటర్లు దూకి ఈ ఈవెంట్‌లలో అద్బుత ప్రదర్శన చేశాడు. లాంగ్ జంప్, హైజంప్, 400మీ.లలో ప్రథమ స్థానంలో నిలిచాడు. 2011లో 7,658 పాయింట్లు సాధించిన భారతీందర్ సింగ్ 12 ఏళ్ల జాతీయ రికార్డును తేజస్విన్ బద్దలు కొట్టాడు. ఆసియా క్రీడల్లో తేజస్విన్‌కి ఇది మొదటి పతకం కావడం విశేషం. అతను హైజంప్, డెకాథ్లాన్ అనే రెండు వేర్వేరు వెంట్‌లలో జాతీయ రికార్డులను కలిగి ఉన్న ఏకైక భారతీయ అథ్లెట్ గా నిలిచాడు.