Page Loader
వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడిన తేజింద‌ర్‌పాల్ సింగ్
వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడిన తేజింద‌ర్‌పాల్ సింగ్

వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడిన తేజింద‌ర్‌పాల్ సింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2023
06:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షాట్ పుట్ తేజిందర్‌పాల్‌సింగ్ తూర్ సంచలనం సృష్టించాడు. వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించాడు. షాట్‌పుట్ పోటీలో తనకు ఎవరూ పోటీలేరని మరోసారి నిరూపించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో తేజిందర్ పాల్ తొలి ప్రయత్నంలోనే అదరగొట్టాడు. షాట్‌పుట్‌ను 20.23 మీట‌ర్ల దూరం విసిరి సత్తా చాటాడు. ఇరాన్‌కు చెందిన స‌బేరి మెహ్డీ(19.98 మీట‌ర్లు), క‌జ‌కిస్థాన్ అథ్లెట్ ఇవ‌న్ ఇవ‌నోవ్ (19.87 మీట‌ర్ల‌) విసిరి వెండి, కాంస్య ప‌త‌కాలను సొంతం చేసుకున్నారు.

Details

ఆగస్టు 17 నుంచి వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలు

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో తేజిందర్‌పాల్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 2019లో అత‌ను 20.22 మీట‌ర్ల‌తో స్వ‌ర్ణం సాధించి, 2017లో తేజింద‌ర్ సిల్వ‌ర్ మెడ‌ల్‌తో రాణించాడు. గత నెలలో భువనేశ్వర్ లో జరిగిన నేషనల్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్ లో ఈ స్టార్ షాట్ పుటర్ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆ పోటీల్లో 21.77 మీట‌ర్ల దూరం విసిరాడు. దీంతో తేజింద‌ర్‌పాల్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌కు క్వాలిఫై అయ్యాడువ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ పోటీలు బుడాపెస్ట్ లో అగస్టు 17 నుంచి 27 వరకు జరగనున్నాయి.