Page Loader
ఆసియా అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు
ఆసియా అథ్లెటిక్స్ కు ఎంపికైన తెలుగు అమ్మాయిలు

ఆసియా అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా అథ్లెటిక్స్ లో తెలుగు అమ్మాయిలు సత్తాచాటారు. జులై 12 నుంచి 16వ తేదీ వరకూ బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ కు తెలుగమ్మాయిులు జ్యోతి యర్రాజి, జ్యోతికశ్రీ దండి ఎంపికయ్యారు. మొత్తం ఈ పోటీల్లో పాల్గొనే 54 మంది సభ్యుల బృందాన్ని గురువారం ప్రకటించారు.ఇందులో 26 మంది మహిళులున్నారు. తెలుగమ్మాయి జ్యోతీ ఎర్రాజి 200 మీ., 100 మీ. హర్డిల్స్ విభాగంలో, జ్యోతికశ్రీ దండి దండి 4×400 మీ. రిలే, 4×400 మీ. మిక్స్‌డ్‌ రిలేలో పోటీ పడనున్నారు. దేశంలోని మేటి క్రీడాకారులంతా బృందంలో చోటు దక్కించుకున్నాడు. జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా, కామన్వెల్త్ క్రీడల రజక పతక విజేత అవినాశ్ శాబెల్ (3000మీ. స్టీపుల్‌చేజ్‌) ఈ పోటీల్లో పాల్గొనకపోవడం విశేషం.

Details

ఆసియా పోటీల్లో పాల్గోనే ప్లేయర్లు వీరే

ఆసియా పోటీల్లో పాల్గొనే మహిళలు జ్యోతి యర్రాజి (200 మీ, 100 మీ. హర్డిల్స్‌), జ్యోతిక శ్రీ దండి, రెజోనా మాలిక్‌ హీనా (4×400 మీ. రిలే, 4×400 మీ. మిక్స్‌డ్‌ రిలే), నిత్య రామ్‌రాజ్‌ (100 మీ. హర్డిల్స్‌), ఐశ్వర్య మిశ్రా (400 మీ, 4×400 మీ.రిలే, 4×400 మీ. మిక్స్‌డ్‌ రిలే), ఆసియా పోటీల్లో పాల్గొనే పురుషులు అమోజ్‌ జాకబ్‌ (4×400 మీ. రిలే, 4×400 మీ. మిక్స్‌డ్‌ రిలే), నిహాల్‌ జోయెల్‌ విలియమ్‌, మహ్మద్‌ అఫ్సాల్‌ (800 మీ.), అజయ్‌ కుమార్‌ సరోజ్‌, జిన్సన్‌ జాన్సన్‌ (1500 మీ.), రాజేష్‌ రమేష్‌, మహమ్మద్‌ అజ్మల్‌ (400 మీ, 4×400 మీ రిలే, 4×400 మీ. మిక్స్‌డ్‌ రిలే),