LOADING...
Rajat Patidar : 'ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మార్చింది'.. కెప్టెన్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు
'ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మార్చింది'.. కెప్టెన్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు

Rajat Patidar : 'ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మార్చింది'.. కెప్టెన్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. అలాగే ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ క్యాచ్ అసాధారణం. టాస్ గెలవడం కూడా మాకు అనుకూలించింది. మా ఫాస్ట్ బౌలర్లు కండీషన్స్‌కు తగ్గట్టు బౌలింగ్ చేశారు. కృనాల్ పాండ్యా చాలా ధైర్యవంతుడు. అతను ఎలాంటి బాల్స్ వేస్తాడో ముందే చెప్పలేం. సుయేష్ శర్మ స్టంప్-టు-స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేసిన తీరు గొప్పది.

వివరాలు

అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్లు

అలాగే భువేశ్వర్ కుమార్, జోష్ హెజిల్‌వుడ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉండటం కెప్టెన్‌గా నాకు అదృష్టం. వాళ్ల అనుభవం వల్ల నా పని చాలా సులభమవుతుంది. తదుపరి ఓవర్‌లో ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఫీల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. దానికి తగ్గట్టుగానే ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టాడని పాటిదార్ తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (40), బదోని (38) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

వివరాలు

49 పరుగులతో రాణించిన విరాట్కోహ్లీ

ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ (4/24) నాలుగు వికెట్లతో చెలరేగగా, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీసి లక్నోను కట్టడి చేశారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి 'ఛేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. అయితే తన 66వ ఐపీఎల్ అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో అవుట్ కావడం గమనార్హం. అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, లాంగ్ ఆన్ వద్ద నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చాడు.

Advertisement

వివరాలు

పిన్స్ యాదవ్ కు మూడు వికెట్లు

కోహ్లీ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ పాటిదార్ (27), వికెట్ కీపర్ జితేశ్ శర్మ (23) వేగంగా పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి సునాయాసంగా గెలుపొందింది. లక్నో బౌలర్లలో పిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

Advertisement