Loading...
Punjab Kings Record: ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఛేజింగ్‌లు.. పంజాబ్ కింగ్స్ డబుల్ డామినేషన్
ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఛేజింగ్‌లు.. పంజాబ్ కింగ్స్ డబుల్ డామినేషన్

Punjab Kings Record: ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఛేజింగ్‌లు.. పంజాబ్ కింగ్స్ డబుల్ డామినేషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో భారీ లక్ష్యాలను ఛేదించడం ఎప్పుడూ కఠిన సవాలుగానే భావిస్తారు. అయితే ఇటీవల జట్లు దూకుడైన బ్యాటింగ్‌తో ఆ సవాళ్లను సులభంగా అధిగమిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ మరోసారి చరిత్రను తిరగరాసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 18.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

వివరాలు

ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన ఛేజ్ గా రికార్డు

265 పరుగుల ఈ విజయవంతమైన ఛేజ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా నిలిచింది. విశేషమేమిటంటే ఇంతకుముందు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరుపైనే ఉంది.

2024లో కోల్‌కతా నైట్ రైడర్స్పై 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించింది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లలో టాప్-2 స్థానాలు పంజాబ్ జట్టుకే దక్కాయి.

ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. 2025లో పంజాబ్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఛేదించింది.

అలాగే 2026లో రాజస్థాన్ రాయల్స్‌పై జైపూర్‌లో 229 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా అందుకుంది.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

వివరాలు

ఐపీఎల్‌లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు

ఈ గణాంకాలు చూస్తే, ఐపీఎల్‌లో బ్యాటింగ్ ఎంతటి ప్రభావం చూపుతోందో స్పష్టమవుతోంది.

భారీ లక్ష్యాలు కూడా సాధ్యమే అన్న నమ్మకంతో జట్లు ఆడుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పరుగుల వరద పారిస్తూ అభిమానులను అలరిస్తున్నాయి.

265 - పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ, 2026

262 - పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, కోల్‌కతా, 2024

246 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్, 2025

229 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్, జైపూర్, 2026

228 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్, లక్నో, 2025

ADVERTISEMENT